News February 13, 2026
వడ్డేపల్లి: 8వ వార్డులో ఏఐఎఫ్‌బీ (AIFB) విజయం..!

వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (AIFB) బోణి కొట్టింది. 8వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థిని నంబి జయశ్రీ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంజలిపై 270 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. BRS అభ్యర్థి సరస్వతి 104, BJP అభ్యర్థి మాధవి 04, నోటకు 2, చెల్లని ఓట్లు 3 పడగా, అందరినీ వెనక్కి నెట్టి జయశ్రీ విజయం సాధించడంతో ఏఐఎఫ్‌బీ శ్రేణులు లెక్కింపు కేంద్రం వద్ద సంబరాల్లో మునిగిపోయాయి.
Similar News
News March 13, 2026
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం కావాలి: కలెక్టర్

నూతన ప్రజాప్రతినిధులు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
News March 13, 2026
రోహిత్, కోహ్లీ కోసం BCCI స్పెషల్ ప్లాన్స్!

T20 WC విజయం తర్వాత BCCI కన్ను ఇప్పుడు 2027 ODI WCపై పడింది. రోహిత్, కోహ్లీ ODIలే ఆడుతుండగా వీరికి మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించేలా విదేశీ పర్యటనల్లో అదనపు సిరీస్‌లను చేర్చేందుకు బోర్డు సిద్ధమవుతోంది. 2011 తర్వాత దక్కని వన్డే WC సాధించాలని పట్టుదలగా ఉంది. అందుకోసం NZ, ఇంగ్లండ్ వంటి జట్లతో అదనపు మ్యాచ్‌లు ఆడుతూ ఈ ఇద్దరు దిగ్గజాలను మెగా టోర్నీకి రెడీ చేసేందుకు BCCI ప్లాన్ చేస్తోంది.
News March 13, 2026
విజయనగరంలో జోయాలుక్కాస్ గ్రాండ్ ఓపెనింగ్

విజయనగరంలో జోయాలుక్కాస్ జువెలరీ షోరూమ్‌ను స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. వినియోగదారులు ఈ షోరూమ్‌లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాలు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. మార్చి 29 వరకు తయారీ ఛార్జీలపై ఫ్లాట్ 40% ప్రారంభ ఆఫర్‌ను అందిస్తున్నట్లు గ్రూప్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జోయ్ అలుక్కాస్ తెలిపారు.


