News November 29, 2024
వణికిస్తోన్న చలి.. కోస్గిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 5 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగా కోస్గి, ఎల్లికల్లో 12.9 ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12.9నుంచి 18.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
Similar News
News December 9, 2025
దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.
News December 9, 2025
జడ్చర్ల: పంచాయతీ ఏర్పడిన ఐదేళ్లకు ఎన్నికలు

జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత 2020 డిసెంబర్ 20 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామంలో మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యలు తీరి గ్రామ సర్పంచ్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందిందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 9, 2025
MBNR: స్వామివారి తలనీలాలకు కోటి రూపాయల టెండర్

తెలంగాణ తిరుపతిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం టెండర్లు నిర్వహించారు. పది సంవత్సరాల క్రితం పలికిన విధంగా ఈసారి కూడా కోటి రూపాయలు తలనీలాలకు రెండేళ్ల కాలపరిమితికి ఐదుగురు వ్యాపారులు పాల్గొన్నారు. శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ వారికి దక్కిందని ఆలయ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు.


