News December 15, 2024
వణుకుతున్న ఉమ్మడి మెదక్

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు వణుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్ జిల్లా శివంపేటలో 8.2, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 9.9 డిగ్రీలు నమోదైంది. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలికి తోడు మంచు కమ్మేయడంతో ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అంటున్నారు.
Similar News
News December 15, 2025
చేగుంట శివారులో మృతదేహం గుర్తింపు

మెదక్ జిల్లా చేగుంట గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే స్టేషన్ పక్కన ఉన్న బాలాజీ వెంచర్లో సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు, ఎలా మరణించాడు అనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
News December 15, 2025
జిల్లాను ఓటింగ్లో టాప్లో ఉంచాలి: కలెక్టర్

శత శాతం ఓటింగ్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గత విడత ఎన్నికల్లో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. మూడో విడత ఎన్నికల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
News December 15, 2025
మెదక్: ‘3వ విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత’

మెదక్ జిల్లాలో జరగనున్న మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిందని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల భద్రతకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.


