News October 3, 2024
వదంతులు నమ్మొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO

చిరుత పులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందవద్దని రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్ పేర్కొన్నారు. మండపేట తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాదరావు, మండపేట టౌన్ SI హరికోటి శాస్త్రితో కలిసి మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిస్తే 18004255909కి ఫోన్ చేయమని తెలిపారు.
Similar News
News December 6, 2025
విమాన సర్వీసుల ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు

రాజమహేంద్రవరం (మధురపూడి) విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులను చవి చూస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను, హైదరాబాద్ వెళ్లే రెండు సర్వీస్‌లను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బెంగళూరు వెళ్లాల్సిన విమానం 7.15 గంటలకు రావాల్సి ఉండగా శుక్రవారంరాత్రి 11 గంటలకు వస్తుందని ప్రకటించారు. ముంబై వెళ్లే విమానాలు సైతం బాగా ఆలస్యంగా నడిచాయి.
News December 6, 2025
నిఘాలో తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందేలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.
News December 6, 2025
పోలీసులు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు: ఎస్పీ

పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ డి.నరసింహా కిషోర్ స్పష్టం చేశారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే బాధ్యులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు.


