News January 29, 2025

వనజీవి దంపతులను సన్మానించిన సీఎం

image

ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య- జానకమ్మను సీఎం రేవంత్ రెడ్డి, సినీనటుడు చిరంజీవి సన్మానించారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రత్యేక కార్యక్రమంలో వారిని వేదికపైకి ఆహ్వానించి సన్మానించిన సీఎం మాట్లాడారు. రైతు కుటుంబం నుంచి వచ్చి రామయ్య లక్షలాది మొక్కలు నాటి పర్యావరణానికి తోడ్పాటునందిస్తుండడంతో పద్మశ్రీ అవార్డు దక్కిందని తెలిపారు. అనంతరం ఆయనకు చెక్కు అందజేశారు.

Similar News

News October 31, 2025

రక్తదాన శిబిరానికి భారీ స్పందన: సీపీ సునీల్ దత్

image

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నేలకొండపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించిందని సీపీ సునీల్‌ దత్ అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని కొనియాడారు. ఈ శిబిరంలో సుమారు 1500 మంది దాతల నుంచి రక్తం సేకరించినట్లు తెలిపారు. ఖమ్మం రూరల్‌ డివిజన్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

News October 31, 2025

సీఎం సారూ.. ఖమ్మం రండి: ముంపు వాసులు

image

ఖమ్మంలో మున్నేరు ముంపు వాసులను ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. 26 అడుగులకు పైగా మున్నేరు ప్రవహించిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వరదతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ఈ రోజు వరంగల్‌లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఖమ్మంలో పర్యటించడం లేదు. దీంతో ముంపు వాసులు సీఎం తమ ప్రాంతంలో పర్యటించి తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

News October 31, 2025

నేటి నుంచి విజయ డెయిరీ దుకాణాలకు టెండర్లు

image

ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ.15వేలుగా నిర్ణయించామని, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు చెల్లించాలన్నారు.