News April 12, 2025

వనజీవి మనవరాళ్లకూ మొక్కల పేర్లే

image

ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య <<16071045>>మృతితో<<>> పర్యావరణ ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన ఇప్పటి వరకు కోటికి పైగా మొక్కలు నాటారు. అతని సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. మొక్కలపై ఉన్న ప్రేమతో తన మనవరాళ్లకు కూడా వాటి పేర్లే పెట్టడం మరో ఆసక్తికర విషయం . వారికి చందనపుష్ప, హరిత లావణ్య. కబందపుష్ప అని పేర్లు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు.

Similar News

News December 17, 2025

మంచిర్యాల జిల్లాలో 27.15% పోలింగ్

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొనసాగుతున్న 3వ విడత పోలింగ్ ఉదయం 9గంటల వరకు 27.15శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మందమర్రిలో 34.92%, చెన్నూర్27.27%, కోటపల్లి 28.63%, జైపూర్ 23.96%, భీమారంలో 24.81%, నమోదయినట్లు అధికారులు వివరించారు. పోలింగ్ బూతుల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

News December 17, 2025

సూర్యాపేట జిల్లాలో 9 గంటల వరకు నమోదైన పోలింగ్

image

సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి 9 వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు.
చింతలపాలెం – 26.84%
గరిడేపల్లి – 25.18%
హుజూర్‌నగర్ – 20.66%
మట్టంపల్లి – 27.74%
మేళ్లచెర్వు – 23.48%
నేరేడుచర్ల – 21.02%
పాలకవీడు – 26.70% నమోదైనట్లు తెలిపారు.

News December 17, 2025

మహబూబాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం

image

మహబూబాబాద్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. డోర్నకల్ 30.42, గంగారం 24.09, కొత్తగూడ 27.32, కురవి 26.74, మరిపెడ 25.74, శిరోల్ 30.74, మొత్తంగా 27.49 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ శాతం ప్రశాంతంగా జరుగుతోందని, ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.