News April 12, 2025
వనజీవి రామయ్య మృతి ధరిత్రికి తీరని లోటు: తుమ్మల

చెట్లనే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి వనజీవి రామయ్య మరణం ధరిత్రికి తీరని లోటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వనజీవి రామయ్య మృతి పట్ల మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటికి పైగా మొక్కలు నాటి, పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న రామయ్య ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారని మంత్రి తుమ్మల గుర్తు చేసుకున్నారు.
Similar News
News December 9, 2025
రేపటి నుంచి టెట్ పరీక్షలు: నెల్లూరు DEO

రేపటి నుంచి ఈనెల 21 వరకు టెట్-2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు ఆన్లైన్లోనే పొందవచ్చని పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.
News December 9, 2025
తిరుచానూరు అర్చకులు మధ్య ఆధిపత్య పోరు..?

తిరుమల తరువాత తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి ఆలయంలో అర్చకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం. ఆలయంలో అనాధికారిక పరిచారకులను అధికారికంగా చేసుకునే విషయంపై ఓవర్గం వారు విజిలెన్స్ అధికారులకు మరో వర్గం సమాచారం ఇవ్వడంతో విచారణ నడుస్తోందట. మంగళవారం విజిలెన్స్ ఉన్నతాధికారుల నివేదికలో ఏమి తేలుస్తారో చూడాలి.
News December 9, 2025
బాపట్ల: హైవేపై డివైడర్ను ఢీకొట్టిన కారు

కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. అరుణాచలం నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు డ్రైవర్ నిద్రమత్తులో స్థానిక నయారా పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్తో పాటు ముగ్గురు మహిళలు ఉండగా ఓ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెని 108 అంబులెన్స్లో స్థానిక PHCకి తరలించారు.


