News June 15, 2024
వనదుర్గ ప్రాజెక్టులో మునిగి వ్యక్తి మృతి

ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తుడు శుక్రవారం నీట మునిగి మృతి చెందాడు. నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడని పాపన్నపేట SI నరేశ్ తెలిపారు. HYDకి చెందిన ఎస్లీ వినోద్(48) స్థానికంగా వంట మనిషిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఏడుపాయలకు వచ్చాడు. సాయంత్రం స్నానం చేసేందుకు వనదుర్గా ప్రాజెక్టులోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 22, 2025
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే!

మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శివన్నగారి ఆంజనేయులు గౌడ్ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణు గోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఆంజనేయులు గతంలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకే ఆయనను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

మెదక్: పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ.. అధికారుల చర్యలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త ప్రతిపాదనలను కమిషన్ సమర్పించింది. ఈ జీవో ఆధారంగా నేడు, రేపు వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీవో, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మెదక్ అధికారులు చర్యలు చేపట్టారు.