News February 25, 2025
వనపర్తికి సీఎం రాబోతున్నారు..!

వనపర్తికి మార్చి 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆరోజు రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో పర్యటించేందుకు సమయం ఇచ్చారన్నారు. ఎంపీ మల్లు రవి, ఒబెదుల్లా కోత్వాల్ తోపాటు కాంగ్రెస్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర రావు తదితరులు సీఎంను కలిశారన్నారు.
Similar News
News November 18, 2025
జేఎన్టీయూలో తినే ఆహారంలో పురుగులు

కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్లో విద్యార్థులు తినే ఆహారంలో మరోసారి పురుగులు దర్శనమిచ్చాయి. సోమవారం రాత్రి హాస్టల్లో అన్నం తినే సమయంలో పురుగులు కనిపించాయని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.

టెన్త్ పరీక్షలపై BIG UPDATE

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో ఓ దానికి ఆమోదం లభించనుంది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.