News February 25, 2025

వనపర్తికి CM రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు

image

వనపర్తిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే స్థలాలను ఆయన పరిశీలించారు. పబ్లిక్ మీటింగ్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

ములుగు: జీరంఘాటి ఘటన వెనక మడవి హిడ్మానే

image

మడవి హిడ్మా నాయకత్వం వహించిన అనేక ఘటనల్లో జీరంఘాటి ఘటన దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. జగదల్పూర్ సమీపంలోని దర్భాఘాట్ వద్ద 2013 మే 25న కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పరివర్తన యాత్రలో భాగంగా 25 వాహనాల్లో వెళ్తున్న కాన్వాయిని మావోయిస్టులు పేల్చి వేశారు. ఈ ఘటనలో మాజీ కేంద్రమంత్రి చరణ్ శుక్లా, రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మ, నంద్ కుమార్ పటేల్, ఉదయ్ ముదలియార్, గోపి మద్వానీ, పూలో దేవి హతమయ్యారు.

News November 19, 2025

కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

image

శబరిమల యాత్రలో పేరూర్‌తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>

News November 19, 2025

భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

image

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<>IBD<<>>) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. నెలకు రూ.90వేలు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/