News April 14, 2025

వనపర్తిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. WNP ప్యాటగడ్డకు చెందిన గంగపురి శేఖర్ సాగర్ వారం క్రితం తన భార్య చిట్టితో కలిసి బైక్‌పై వస్తున్నారు. గోపాల్పేట మం. బుద్దారం గండిలో ఓ ట్రాక్టర్ వీరిని ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్సపొందుతూ శేఖర్‌సాగర్ మృతిచెందారు.

Similar News

News November 27, 2025

వంటింటి చిట్కాలు

image

* కూరల్లో పెరుగు వేసేటప్పుడు నేరుగా కలపకుండా, ఒక కప్పులో వేసి స్పూన్‌తో చిలికి వెయ్యాలి. అప్పుడే గ్రేవీ మొత్తానికి చిక్కదనం వస్తుంది.
* పాలు మాడకుండా ఉండాలంటే కాచే ముందు గిన్నెలో కొద్దిగా చన్నీరు పోసి వంపేయాలి.
* కిస్‌మిస్ నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే నెలల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి.
* గుడ్లు ఉడికించేటప్పుడు కాస్త నూనె వేస్తే పగలవు.

News November 27, 2025

మెదక్: వార్డు సభ్యుల గుర్తులు ఇవే..

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు వేరువేరుగా గుర్తులను కేటాయించనున్నారు. వార్డు సభ్యులకు 20 గుర్తులను నిర్ణయించగా ఆ గుర్తులు ఇవే. గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈలా, కుండ, డిష్ యాంటినా, గరాట, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవరు, హాకీ స్టిక్, బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టే, విద్యుత్ స్తంభం, కెటిల్ ఉన్నాయి.

News November 27, 2025

పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ను కలిసిన DCP

image

రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌(DCP)గా ఇటీవల నూతనంగా నియమితులైన భూక్య రామ్‌రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు రామ్‌రెడ్డి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.