News January 25, 2025
వనపర్తిలో డేంజర్ ఫుడ్.!

జిల్లాల్లోని విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. ఇటీవల గద్వాలలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ దందాను పోలీసులు పట్టుకున్నారు. ఈనెల11న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముఠాలో ఒకరు జిల్లాలో ఫ్యాక్టరీ పెట్టి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. GWL, WNP, NGKL జిల్లాల్లోని చిరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరకు అమ్మే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త.!
Similar News
News November 23, 2025
ఏలూరు జిల్లాకు పవన్.. పటిష్ఠ బందోబస్తు

ఐ.ఎస్.జగన్నాధపురంలో సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లపై, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఏఎస్పీ సూర్యచంద్రరావు ఆదివారం సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వీఐపీ ఎంట్రీ, పార్కింగ్, హెలిప్యాడ్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News November 23, 2025
RBIలో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

<
News November 23, 2025
వన్డేలకు కొత్త కెప్టెన్ను ప్రకటించిన టీమ్ ఇండియా

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు భారత జట్టుకు కొత్త కెప్టెన్ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.


