News March 24, 2025
వనపర్తిలో నిరంజన్ రెడ్డి VS మేఘారెడ్డి

వనపర్తిలో మాజీ మంత్రి, BRS మాజీ MLA నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ MLA మేఘారెడ్డి మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇవ్వాలని ఆగిన నిరంజన్ రెడ్డి ఇటీవల జోష్ పెంచారు. నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మేఘారెడ్డి సైతం BRS ఆరోపణలకు కౌంటర్ ఇస్తూనే నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. మీ కామెంట్?
Similar News
News November 28, 2025
KMM: సర్పంచ్ ఎన్నికల్లో తొలిసారి నోటా!

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ తొలిసారి ఓటర్లకు ‘నన్ ఆఫ్ ద అబౌ(నోటా)’ అవకాశాన్ని కల్పించారు. బ్యాలెట్ పత్రంపై అభ్యర్థుల గుర్తులతోపాటు నోటా గుర్తును కూడా ముద్రిస్తున్నారు. ఉమ్మడి KMM జిల్లాలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేసేందుకు సిద్ధంగా లేకపోతే ఓటరు నోటాకు వేయొచ్చు.
News November 28, 2025
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ ఫండ్స్.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. CCT కింద బ్లడ్, ఐ బ్యాంక్‌ను 27 ఏళ్లుగా చిరంజీవి నిర్వహిస్తున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం విదేశీ విరాళాలు తీసుకునేందుకు FCRA అనుమతి కోరుతూ ట్రస్ట్ చేసిన అభ్యర్థనకు కేంద్రం అంగీకారం తెలిపింది. ట్రస్ట్ సేవలు విస్తృతమవుతాయని మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 28, 2025
అమ్రాబాద్ మండలంలో 14.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. అమ్రాబాద్ మండలంలో 14.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కల్వకుర్తి మండలం తోటపల్లిలో 14.5, వెల్దండ 14.6, బిజినపల్లి 14.8, తెలకపల్లి 14.9, తాడూరులో 15.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఉదయం వేళలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


