News March 24, 2025

వనపర్తిలో నిరంజన్ రెడ్డి VS మేఘారెడ్డి

image

వనపర్తిలో మాజీ మంత్రి, BRS మాజీ MLA నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ MLA మేఘారెడ్డి మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇవ్వాలని ఆగిన నిరంజన్ రెడ్డి ఇటీవల జోష్ పెంచారు. నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మేఘారెడ్డి సైతం BRS ఆరోపణలకు కౌంటర్ ఇస్తూనే నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. మీ కామెంట్?

Similar News

News April 20, 2025

కోర్టుకెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తా: ఎమ్మెల్యే 

image

హైదరాబాద్: కొండాపూర్‌లో 39 ఎకరాల స్థల వివాదంలో హైడ్రా రంగంలోకి దిగింది. శనివారం పోలీసుల బందోబస్తుతో అక్కడికి చేరుకున్న అధికారులు, స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఈ స్థలం మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు చెందినదని సమాచారం. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తామని తెలిపారు.

News April 20, 2025

అనితర సాధ్యుడు చంద్రబాబు: పవన్ కళ్యాణ్

image

AP CM చంద్రబాబుకు Dy.CM పవన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అనితర సాధ్యుడు చంద్రబాబు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై శాంతిభద్రతలు క్షీణించిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేయడం ఆయనలాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. ఆయన విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థల్ని నడిపించే విధానం స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు.

News April 20, 2025

VZM: మహిళ దారుణ హత్య

image

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!