News March 2, 2025
వనపర్తిలో మిత్రుడు.. CMగా వచ్చాడు! (PHOTO)

CM అయ్యాక స్నేహితుడు మన మధ్యకు వస్తే గూస్బంప్స్ రావాల్సిందే. వనపర్తిలో అదే జరిగింది. 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు WNPలో చదివిన రేవంత్ రెడ్డి ఆదివారం CM హోదాలో జిల్లాకు వచ్చారు. ఆనాటి మిత్రులు గుర్తొచ్చి ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. హంగు, ఆర్భాటం అన్నీ వదిలేసిన CM స్నేహితులతో కలిసిపోయారు. భోజనం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. స్నేహానికి మన CM ఇచ్చిన ప్రియారిటీకి హాట్సాఫ్.
Similar News
News November 26, 2025
నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

మునుగోడు: పెట్రోల్ బంకుల్లో తనిఖీ
శాలిగౌరారం: వే2న్యూస్ కథనానికి స్పందన
పెద్దవూర: హైవేపై రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్
నల్గొండ: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షలు: మంత్రి కోమటిరెడ్డి
మిర్యాలగూడలో భారీ ర్యాలీ
నల్గొండ: సర్పంచ్ ఎన్నికల్లో వారిని దింపేందుకు ఫోకస్
నల్గొండ: పల్లెపోరుకు యంత్రాంగం రెడీ
మిర్యాలగూడ: వందే భారత్ రైలుకు అదనంగా 4 బోగీలు
కట్టంగూరు : భక్తులను ఆకట్టుకున్న మల్లన్నమర్రి
News November 26, 2025
జగిత్యాల: ‘రాజ్యాంగం ద్వారానే బలహీనవర్గాలకు సంక్షేమ ఫలాలు’

అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘అంబేద్కర్ సూర్యుడు’ అనే పుస్తకాన్ని అంబేడ్కర్ సేవా సభ్యులు నరేందర్, శివ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతలకు అందజేశారు.
News November 26, 2025
‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి’

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల నుంచి ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగర్వాల్ అధికారులు పాల్గొన్నారు


