News March 21, 2025
వనపర్తిలో వ్యక్తికి జైలు శిక్ష

ప్రజలు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపవద్దని వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి అన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వనపర్తికి చెందిన రమేశ్ నాయక్ అనే వ్యక్తిని గురువారం కోర్టులో హాజరు పరచగా.. అతడికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించామని తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
Similar News
News November 14, 2025
పోటీ పరీక్షల్లో ప్రాక్టీస్ అత్యవసరం: కలెక్టర్ రాజర్షి షా

ప్రభుత్వ పోటీ పరీక్షల్లో రాణించి ర్యాంకులు సాధించాలంటే పట్టుదల, ఆత్మవిశ్వాసం, ప్రాక్టీస్ అత్యవసరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ హాల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం కోసం అభ్యర్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేష్ పాల్గొన్నారు.
News November 14, 2025
35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలు.. వరుసగా 9వ సారి ఎన్నిక!

బిహార్లో సీనియర్ నేతలు ప్రేమ్ కుమార్(BJP), బిజేంద్ర ప్రసాద్ యాదవ్(JDU) అరుదైన ఘనత సాధించారు. వరుసగా 9వ సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1990 నుంచి వారు MLAలుగా కొనసాగుతుండటం గమనార్హం. తాజా ఎన్నికల్లో గయా టౌన్ నుంచి 26,423 ఓట్ల మెజారిటీతో ప్రేమ్ కుమార్ గెలవగా, సుపౌల్లో 16,448 ఓట్ల ఆధిక్యంతో బిజేంద్ర గెలుపొందారు. దాదాపు 35 ఏళ్లుగా ఇద్దరూ అవే నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.
News November 14, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.


