News April 6, 2025

వనపర్తిలో శవం కలకలం..!

image

డ్రైనేజ్ కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వనపర్తి 20వ వార్డుకు చెందిన కార్ డ్రైవర్ శ్రీను(46) శనివారం సాయంత్రం రామా టాకీస్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 27, 2025

బయటకు సుందరం.. లోపల దుర్గంధం

image

వేములవాడ పట్టణంలోని VIP రోడ్డు ప్రాంతం బయటకు అందంగా కనిపిస్తుండగా.. వెనుక వైపు దుర్గంధం వెదజల్లుతోంది. పోలీస్ స్టేషన్- పార్వతీపురం దారిలో ఉన్న వీఐపీ రోడ్డులో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇనుప రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ కనపడకుండా దీనిని ఫిక్స్ చేశారు. మురికి కాలువ మళ్లించే పనులు అటకెక్కడంతో చెత్త పేరుకుపోయి, మురికి నీరు నిలిచి ఈ ప్రాంతంలో కంపు కొడుతోంది.

News November 27, 2025

VKB: అనుమానస్పద వ్యక్తులపై నిఘా: SP

image

స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహ మెహ్రా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మొదటి విడతలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆమె పేర్కొన్నారు. అనుమానస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు.

News November 27, 2025

తిరుమల: కల్తీ నెయ్యి కేసులో మరో అరెస్ట్.!

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. గతంలో టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారు. తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తికి తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినవారి సంఖ్య 9కి చేరింది.