News March 3, 2025

వనపర్తిలో CM చేసిన అభివృద్ధి పనులు

image

✔వనపర్తిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
✔కొత్త ఐటీ టవర్, కొత్త ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి
✔జిల్లా పరిషత్ (బాలుర) పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాల నిర్మాణం
✔శ్రీ రంగాపురం దేవాలయం అభివృద్ది పనులు
✔ పెబ్బేరులో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం
✔రాజానగరం–పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, ST హాబిటేషన్ వర్కింగ్ భవనం
వనపర్తి పట్టణంలో CCR రోడ్ల నిర్మాణ పనులకు CM రేవంత్ శంకుస్థాపన చేశారు.

Similar News

News September 17, 2025

విశాఖ: పిల్లల ఉచిత శిక్షణా కార్యక్రమాలు పునఃప్రారంభం

image

VMRDA బాలల ప్రాంగణంలో పిల్లల కార్యక్ర మాలు సెప్టెంబర్ 21 నుంచి ప్రతి ఆదివారం పునఃప్రారంభమవుతాయని ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ బుధవారం వెల్లడించారు. విద్యార్థులకు ఇంగ్లీష్, పబ్లిక్ స్పీకింగ్, సంగీతం, డ్రాయింగ్, సైన్స్, కథా విన్యాసం, ఆర్ట్ & క్రాఫ్ట్, క్విజ్, AI కోడింగ్, కాలిగ్రఫీ, మ్యాథ్స్, నటన వర్క్‌షాప్, కెరీర్ గైడెన్స్ వంటి విభాగాలలో ఉచిత శిక్షణ అందిస్తారు.

News September 17, 2025

GNT: CM ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్

image

DSC నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం సమీక్షించారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర సచివాలయం దగ్గర DSCలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రాంగణంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో SP వకుల్ జిందాల్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, గుంటూరు RDO శ్రీనివాస రావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.

News September 17, 2025

హైడ్రాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

image

హైడ్రాలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ‘ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజల సాధకబాధకాలను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు.