News March 29, 2025
వనపర్తి: అందులో అలసత్వం వద్దు: కలెక్టర్

జిల్లాలో 451 మంది మరణించిన వృద్ధాప్య పెన్షన్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, గ్రామాల వారీగా వివరాలు సేకరించి, మరణ ధృవపత్రం, ఆధార్ కార్డు, భాగస్వామి బ్యాంక్ ఖాతా MPDO కార్యాలయంలో అందిస్తే APR 10లోగా వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతూ చనిపోయిన వారి స్థానంలో భాగస్వామికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయడంలో అలసత్వం వహించరాదన్నారు.
Similar News
News November 14, 2025
టాస్ ప్రాక్టీస్ చేస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్.. కారణమిదే!

కోల్కతాలో రేపు సౌతాఫ్రికా-ఇండియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటీస్ కెప్టెన్ బవుమా ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. ‘ఇటీవల కేన్ విలియమ్సన్ను కలిశా. భారత్ను ఓడించేందుకు కొన్ని పాయింట్స్ అడిగా. కేన్ పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ టాస్ గెలవాలని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కాయిన్ టాస్ వేయడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని చెప్పారు. తాము సిరీస్ కోసం బాగానే సిద్ధమయ్యామని అనుకుంటున్నానని తెలిపారు.
News November 14, 2025
అన్నమయ్య జిల్లాలో విజిబుల్ పోలీసింగ్

ప్రజల భద్రతే లక్ష్యంగా ‘విజిబుల్ పోలీసింగ్’ ముమ్మరం చేసినట్లు అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం గురువారం వెల్లడించింది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి, వారి భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
News November 14, 2025
జీవకోన వాసికి 14 రోజుల రిమాండ్

భారీ స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్ను అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రామకిశోర్ వివరాల మేరకు.. గురువారం గంజాయి తరలిస్తున్న జీవకోన వాసి జగదీష్ (37)ను ఉదయం 10 గంటలకు గోవింద హోమ్ స్టే సమీపంలో పట్టుకున్నారు. 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.


