News February 14, 2025

వనపర్తి: అక్రమ ఇసుక డంపులను సీజ్ చేసిన అడిషనల్ కలెక్టర్

image

పెబ్బేరు మండల పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వచేసిన 400 ట్రాక్టర్ల అక్రమ ఇసుక డంపులను అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేసి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేయడం కానీ, అక్రమ రవాణా చేసిన కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజన్ అధికారి, సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ లక్ష్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాఘవేందర్రావు రావు ఉన్నారు.

Similar News

News February 21, 2025

సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం కావాలి: SP

image

మార్చి 8న జరిగే లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించేలా చూడాలని పోలీసులకు ఎస్పీ రూపేశ్ ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ కార్యాలయం నుంచి ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.

News February 21, 2025

సంగారెడ్డి: ట్రైబల్ వెల్ఫేర్ సిబ్బందిపై విచారణకు కలెక్టర్ ఆదేశం

image

కంగ్టిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల వసతి గృహంలో సిబ్బంది విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పందించారు. వసతి గృహంలో ఉదయం అల్పాహారాన్ని విద్యార్థులతో చేయించడాన్ని ఆమె తప్పుబట్టారు. హాస్టల్ సిబ్బందిపై విచారణ చేపట్టి రిపోర్టు సమర్పించాలని నారాయణఖేడ్ ఆర్డిఓ ఎస్.అశోక్ చక్రవర్తిని ఆదేశించారు.

News February 21, 2025

ఫిబ్రవరి 21: చరిత్రలో ఈరోజు

image

1894: శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ జననం (ఫొటోలో)
1941: ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫ్రెడరిక్ బాంటింగ్ మరణం
1976: సినీ గాయకుడు విజయ ప్రకాశ్ జననం
1977: సినీ గాయకుడు రంజిత్ జననం
1988: నటి వేదిక జననం
2013: దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి
* అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

error: Content is protected !!