News March 18, 2025
వనపర్తి: అనధికార లే అవుట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

అనుమతి లేని, అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోకపోతే ఇబ్బందులు తప్పవని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో ఎల్ఆర్ఎస్ పేమెంట్ల అంశంపై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అనుమతిలేని, అనధికార లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
Similar News
News November 5, 2025
జీవ ఎరువులతోనే భూమాతకు రక్షణ: కలెక్టర్

రసాయన ఎరువుల బదులు జీవ ఎరువులను (బయో ఫెర్టిలైజర్స్) విరివిగా వాడేలా రైతుల్ని చైతన్య పరచాలని కలెక్టర్ లక్ష్మీశా అధికారులకు సూచించారు. బుధవారం జరిగిన జిల్లాస్థాయి భూమాత రక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికే కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 5, 2025
కోస్గి: సీఎం ఇలాకా.. క్రీడల మంత్రి జిల్లాలో ఇదీ పరిస్థితి..!

కోస్గి కేంద్రంలో జరుగుతున్న అండర్-17 హ్యాండ్బాల్ జట్ల ఎంపికకు వచ్చిన క్రీడాకారులు అసౌకర్యానికి గురయ్యారు. వారికి భోజనం చేసేందుకు సరైన స్థలం లేక డ్రైనేజీ పక్కన కూర్చుని తినాల్సి వచ్చింది. సీఎం ఇలాకా.. క్రీడల మంత్రి జిల్లాలోనే ఈ పరిస్థితి ఉండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలలోనైనా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
News November 5, 2025
FLASH: బీజాపూర్- HYD హైవేపై మరో యాక్సిడెంట్

మీర్జాగూడ ఘటన మరవకముందే తాజాగా బీజాపూర్-HYD జాతీయ రహదారిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం తాజ్ సర్కిల్ వద్ద బుధవారం హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు ఇరుకుగా ఉండడంతో వేగంగా మర్రిచెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలవగా మరొక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.


