News April 4, 2025
వనపర్తి: అమ్మాయిల వెంట పడితే ఇక అంతే..!

పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గిరిజనుల సంక్షేమ పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. వి.రజని మాట్లాడుతూ.. బాల బాలికలను వివిధ రకాలైన లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి ఏర్పాటు చేసినట్లు ఉదాహరణలతో వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
Similar News
News November 26, 2025
‘సీఎం’ వివాదాన్ని మేమే పరిష్కరిస్తాం: ఖర్గే

కర్ణాటకలో CM పదవి వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్, తాను కలిసి పరిష్కరిస్తామని వెల్లడించారు. కర్ణాటకలో క్షేత్రస్థాయిలో ఉన్న వారు మాత్రమే పరిస్థితిని అంచనా వేయగలరని చెప్పారు. కాగా ఈ విషయంపై రానున్న 48 గంటల్లో రాహుల్‌తో ఖర్గే భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాత సిద్దరామయ్య, DK శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
News November 26, 2025
రైతు ఆర్థిక బలోపేతానికి ‘రైతన్నా.. మీకోసం’: కలెక్టర్

రైతును ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లిలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆమె రైతుల సమక్షంలో నిర్వహించారు. రైతు సత్యనారాయణ రాజు మండువా పెంకుటిల్లు అరుగుపైనే ఈ కార్యక్రమం జరిగింది.
News November 26, 2025
సమీకృత వ్యవసాయ యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్

లక్ష్మీదేవిపల్లి లోతువాగు గ్రామంలో పడిగ అపర్ణ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ యూనిట్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం సందర్శించారు. అవలంబిస్తున్న పద్ధతులు, మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌజు పిట్టలు, నాటు కోళ్లు, బాతులు, కొరమీను, మేకలు, కూరగాయలు, మునగ సాగు వివరాలపై ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్డీవో విద్యచందన పాల్గొన్నారు.


