News March 22, 2025

వనపర్తి: ఆత్మకూరులో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా ఆత్మకూరు, కానాయిపల్లిలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేర్ 38.5, దగడ 38.4, అమరచింత 38.3, మదనాపూర్ 38.2, విలియంకొండ 38.1, పెద్దమందడి 37.9, పానగల్ 37.8, రేమద్దుల 37.6, వెలుగొండ 37.5, వనపర్తి 37.4, జానంపేట 37.2, శ్రీరంగాపూర్ 37.0, గోపాల్‌పేట 36.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 25, 2025

స్టేట్ చీఫ్‌గా ఎంపీ ఈటల రాజేందర్..?

image

ఉగాదిలోపు తెలంగాణ BJPకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. అయితే BC నేతను నియమిస్తారా.. లేక OCకి దక్కుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా పరిశీలనలో ఈటల రాజేందర్ ముందువరసలో ఉన్నట్లు తెలిసింది. MP అర్వింద్, DK అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్‌కు మరోసారి అధ్యక్ష పదవీ దక్కొచ్చని చర్చ జరుగుతోంది.

News March 25, 2025

పాలమూరుకు మరో మంత్రి పదవి..!

image

పాలమూరు జిల్లాకు మరో మంత్రి రానుందని టాక్. మక్తల్ MLA వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో చర్చ అనంతరం మంత్రివర్గ విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. మార్చి30న ఉగాది పండగ రోజు కొత్త మంత్రులు రానున్నారు.కాగా ఉమ్మడి MBNR నుంచి CM రేవంత్ రెడ్డి (కొడంగల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) మంత్రులుగా ఉండగా శ్రీహరితో ఆ సంఖ్య 3కు చేరనుంది.

News March 25, 2025

ఉద్దానంలో ఆకట్టుకున్న ‘ప్రేమ’ పనసకాయ

image

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం ఉద్దానం గ్రామంలో ఒక పనసచెట్టుకు కాచిన పనసకాయ LOVE ఆకారంలో ఉండటం చూపరులను ఆకట్టుకుంటుంది. గ్రామానికి చెందిన ఒక రైతుకు చెందిన చెట్టుకు ఈ అరుదైన కాయ కాసింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోను గ్రామస్థులు, యువత సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలో ప్రేమ పనస అంటూ ఫొటోను SHARE చేస్తున్నారు.

error: Content is protected !!