News March 3, 2025
వనపర్తి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి చేస్తా: సీఎం

వనపర్తి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వనపర్తికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఐదేళ్ల క్రితం వనపర్తి లో గెలిచిన MLA రాజకీయాలను కలుషితం చేశారన్నారు. వనపర్తి లో అనేక విద్యాసంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే పునాది వేశాయని తెలిపారు. వనపర్తిలో నేను నేర్చుకున్న రాజకీయ చైతన్యం తోనే తెలంగాణ CMగా మీ ముందు నిలబడ్డానని అన్నారు.
Similar News
News September 18, 2025
శ్రీశైలంలో దసరా ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

శ్రీశైలంలో ఈనెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తూ గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్దా రాజశేఖర్ రెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శ్రీనివాసరావు, టీడీపీ ఇన్‌ఛార్జ్ యుగంధర్ రెడ్డి తదితరులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రికతో పాటు మల్లన్న ప్రసాదాన్ని అందజేశారు.
News September 18, 2025
కృష్ణా: ‘స్వచ్ఛతాహి సేవ’పై సమీక్ష

కలెక్టర్ డి.కె. బాలాజి గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, డ్వామా, రహదారులు-భవనాల శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం, ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.
News September 18, 2025
అసెంబ్లీ సమావేశాలు కుదింపు

AP: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల పనిదినాలను ప్రభుత్వం 8 రోజులకు కుదించింది. ఈనెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత అసెంబ్లీని ఈనెల 30 వరకు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో <<17749258>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే. అటు రేపు మధ్యాహ్నం రూ.1.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.