News April 16, 2025
వనపర్తి: ఆరు రోజులు పని చేస్తే నాలుగు రోజులకే కూలి: కూలీలు

వనపర్తి జిల్లాలో వారంలో 6 రోజులు ఉపాధి హామీ పనులకు వెళితే 4 రోజులకే కూలి ఇస్తున్నారని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. ఈవిషయమై కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఏపీవోలతో ఆరా తీయగా నిజమేనని అంగీకరించారు. వారు మాట్లాడుతూ.. రోజు రూ.300కూలి ఇవ్వాలని ఉందన్నారు. ఎండలకు కూలీలు రోజుకు రూ.300 సరిపడా పని చేయటం లేదన్నారు. 5 రోజులు చేసిన పని లెక్కిస్తే 4 రోజుల కూలీకే సరిపోతుందన్నారు. పరిశీలించాలని కూలీలు కోరుతున్నారు.
Similar News
News October 24, 2025
ములుగు: లొంగిపోయిన అన్నలకు.. పోలీసులే సెక్యూరిటీ!

దశాబ్ధాల కాలంగా పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, మందు పాతరల పేల్చివేతలు నిత్యం వింటూనే, చూస్తూనే ఉన్నాం. పోలీసులు అడవుల్లో జల్లెడ పట్టే క్రమంలో మావోయిస్టులు తారాసపడితే కాల్పులు జరగడం, ఇరువురిలో ప్రాణనష్టం జరగడం పరిపాటి. అలాంటి అగ్రనేతలు మాల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలు లొంగిపోగా, ప్రస్తుతం పోలీసులే వారికి ‘వై’ సెక్యూరిటీ కల్పించడం గమనార్హం.
News October 24, 2025
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియాలో మేనేజర్ పోస్టులు… అప్లై చేశారా?

ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా( EPI) లిమిటెడ్లో 18 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 29 ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు, HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://epi.gov.in/
News October 24, 2025
వింజమూరు: కర్నూల్ బస్సు ప్రమాదంలో ఒక కుటుంబం సేఫ్

కర్నూల్ BUS ప్రమాదంలో వింజమూరు(M) కొత్తపేటకు చెందిన నెలకుర్తి రమేశ్ కుటుంబం సురక్షితంగా బయటపడింది. ప్రమాదాన్ని గమనించి BUS అద్దాలను పగులగొట్టి భార్య శ్రీలక్ష్మి(26), కుమారుడు అకీరా (2), కుమార్తె జయశ్రీ (5)లను రమేశ్ కాపాడుకున్నారు. వింజమూరు(M)గోళ్లవారిపల్లికి చెందిన <<18088100>>గోళ రమేశ్ కుటుంబం మృతి చెందిన విషయం తెలిసిందే.<<>> ఈ2 కుటుంబాలు హైదరాబాదులో దీపావళి వేడుకులను చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.


