News April 4, 2025

వనపర్తి: ‘ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి’

image

ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండ్ల రాజు,పుట్ట ఆంజనేయులు అన్నారు. శుక్రవారం వనపర్తిలోని సీఐటీయూ కార్యాలయంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సునీత అధ్యక్షతన ఆశా వర్కర్ల సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.

Similar News

News October 27, 2025

విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు: మంత్రి గొట్టిపాటి

image

మొంథా తుఫాను నేపథ్యంలో 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సోమవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరా లో సమస్యలు తలెత్తిన వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు .ఎక్కడైనా పవర్ సప్లై‌లో అంతరాయం కలిగితే 1912 నెంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

News October 27, 2025

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి హౌసింగ్, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News October 27, 2025

MHBD: ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

రైతులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వాతావరణ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, సంబంధిత విభాగాల అధికారులతో కలెక్టర్ టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించి తగిన సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు.