News March 30, 2025

వనపర్తి: ఆ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఉద్యోగం పొంది ప్రజాసేవ చేసే భాగస్వామ్యం అందరికీ దక్కుతుందని అలాంటి అవకాశాన్ని పొందిన ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నరు. జిల్లా రెవెన్యూ విభాగంలో ఐ సెక్షన్ సూపరింటెండెంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నాయబ్ తహశీల్దారు భక్షి శ్రీకాంత్ రావు ఉద్యోగ విరమణ దంపతులకి ఘనంగా సన్మాన కార్యక్రమం జిల్లా కలెక్టర్ సముదాయంలో ఘనంగా సన్మానించారు.

Similar News

News October 15, 2025

CTR: రేపే LPG బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం

image

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్ర చెరువుపల్లి వద్ద LPG బాట్లింగ్ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు పాల్గొంటారు.

News October 15, 2025

గద్వాల: బీజేపీ జిల్లా మోర్చా నాయకుల సమావేశం

image

జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో బీజేపీ జిల్లా మోర్చా నాయకుల సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో, ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్, సుకన్య సమృద్ధి యోజన, పీఎం మాతృ వందన యోజన వంటి పథకాలను మోర్చా నాయకులు ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

News October 15, 2025

MGU డిగ్రీ పరీక్ష ఫీజు.. 25 వరకు గడువు

image

నల్గొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(ఎంజీయూ) పరిధిలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 25వ తేదీ ఆఖరు అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ) డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఆలస్య రుసుం రూ.100తో అక్టోబరు 27 వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.