News March 26, 2025
వనపర్తి: ఆ కార్యక్రమానికి కలెక్టర DEADLINE

30 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఉచిత మధుమేహ పరీక్షలు చేసే కార్యక్రమాన్ని మార్చి 31 లోపు పూర్తిచేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్లూకోమీటర్ ద్వారా మధుమేహం పాజిటివ్ వచ్చిన వ్యక్తికి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలన్నారు.
Similar News
News April 2, 2025
‘పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి’

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం ఐడిఓసిలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలకు అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
News April 2, 2025
నారాయణపేట: ‘ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజం’

ఉద్యోగులుగా విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన రాజా రామ్ ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో రాజా రామ్ దంపతులకు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో చేసిన సేవలను కొనియాడారు. శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, ప్రజా సేవ చేయాలని కోరారు. సిబ్బంది పాల్గొన్నారు.
News April 2, 2025
వరంగల్ మార్కెట్లో ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటా ధర రూ.28వేలు, సింగిల్ పట్టికి రూ.28,011 పలికింది. దీపిక మిర్చి క్వింటా ధర రూ.12,500, 1048 రకం మిర్చికి రూ.10వేలు, 5531 మిర్చికి రూ.9వేలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు. .