News March 12, 2025
వనపర్తి: ఇంటర్ పరీక్షలకు 150 మంది విద్యార్థులు గైర్హాజరు

వనపర్తి జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం బోటనీ, మాథ్స్, పొలిటికల్ సైన్స్ పరీక్షలకు 5,837 మంది విద్యార్థులు హాజరు కాగా, 150 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం పెద్దమందడి మండల కేంద్రంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు డీఐఈఓ పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్‌లో మరో ఇద్దరు అరెస్ట్

విశాఖ సీపీ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో మధురవాడకు చెందిన కోపనాతి తేజ సాయి(27), రాంబిల్లికి చెందిన దూళి తలుపులు(34)ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. వీరు మధ్యవర్తిగా క్రికెట్ లావాదేవీలు జరపుతుంటారని, ఇంకొందరు బుకీల సమాచారం సేకరించి వారినీ అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు.
News March 13, 2025
ఎన్టీఆర్: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్

విజయవాడ మీదుగా లింగంపల్లి(LPI)- కాకినాడ టౌన్(CCT) రైళ్లు ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.07445 CCT- LPI రైలు ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు, నం.07446 LPI- CCT రైలు ఏప్రిల్ 3 నుంచి జూలై 1 వరకు సికింద్రాబాద్ స్టేషనులో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లకు పై తేదీలలో చర్లపల్లిలో స్టాప్ ఇచ్చామన్నారు.
News March 13, 2025
Balochistan Fight: పాకిస్థాన్, చైనా దోచుకుంటున్నాయని..!

పాకిస్థాన్, చైనా కలిసి తమను దోపిడీ చేస్తున్నాయనేది బలూచిస్థాన్ జాతీయవాదుల ఆవేదన. ఆ ప్రాంతంలో బొగ్గు, సహజవాయువు, బంగారం, రాగి లాంటి ఖనిజాలు భారీగా ఉంటాయి. వాటిని దోచుకుంటూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదని అక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అరేబియా సముద్రంతో లింక్ కోసం చైనా బలూచిస్థాన్‌లో గ్వాదర్ పోర్ట్ నిర్మిస్తోంది. ఇది CPECలో చాలా కీలకమైన ప్రాజెక్టు. వారి కోపానికి ఇదీ ఓ ప్రధాన కారణం.