News January 29, 2025

వనపర్తి: ఇండియా క్రికెట్ జట్టుకు ఎంపిక

image

గోపాల్‌పేట మండలానికి చెందిన బెంజిమన్ ప్రభాకర్ దివ్యాంగుల భారత క్రికెట్ జట్టుకి సెలక్ట్ అయ్యారు. నేపాల్‌లోని ఖాట్మాండులో వచ్చే నెల 14న జరగబోయే టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనున్నారు. ప్రభాకర్ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Similar News

News October 27, 2025

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి పేరు ఇదే..!

image

కేంద్ర పౌర విమానాయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడికి నామకరణం మహోత్సవం ఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. రామ్మోహన్ కుమారుడికి శివన్ ఎర్రం నాయుడు అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, జీఎంఆర్ సంస్థల అధినేత, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, ఎర్రం నాయుడు సోదరులు, కింజరాపు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

News October 27, 2025

HYD: ఆధార్ బయోమెట్రిక్‌కు పెరుగుతున్న డిమాండ్

image

HYDలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ డిమాండ్ పెరుగుతోంది. UIDAI మైత్రివనం స్టేట్ టీం అధికారులు తెలిపినట్లుగా ఈ ప్రక్రియ సుమారు 15MINలో పూర్తవుతుంది. ప్రజలు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా వేగంగా సేవలు పొందొచ్చని సూచించారు. నగరంలోని అనేక కేంద్రాలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక కేంద్రాల్లో పరిష్కారం దొరకకపోతే మైత్రివనం ఆఫీస్ రావాలన్నారు.

News October 27, 2025

సెంచరీలతో రాణించిన కరుణ్, రహానే

image

టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్లు కరుణ్ నాయర్, అజింక్య రహానే ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచుల్లో సెంచరీలు చేశారు. గోవాతో మ్యాచులో కర్ణాటక తరఫున కరుణ్ 174* రన్స్‌తో రాణించారు. ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచులో ముంబై బ్యాటర్ రహానే 159 రన్స్ చేశారు. మరి ఇండియన్ టెస్టు టీమ్‌లో వీరికి చోటు దక్కుతుందేమో చూడాలి.