News February 19, 2025

వనపర్తి: ఇద్దరు కుమారులతో పాటు తల్లి అదృశ్యం

image

ఇద్దరు కుమారులతో పాటు తల్లి అదృశ్యమైన ఘటన పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పానుగంటి అలివేల తమ కుమార్తె, మనవాళ్లు చందు, మణిలు ఈనెల 13వ తేదీ నుంచి కనబడటం లేదని పెద్దమందడి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. వారి ఆచూకీ తెలిసిన వారు పెద్దమందడి పోలీసులకు సమాచారమందిచాలని కోరారు.

Similar News

News October 25, 2025

ముగిసిన చంద్రబాబు దుబాయ్ పర్యటన

image

AP: మూడు రోజుల దుబాయ్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబు బృందం పాల్గొంది. నవంబర్ 14, 15న విశాఖలో జరగనున్న CII ఇన్వెస్టర్స్‌ మీట్‌కు వారిని ఆహ్వానించింది. నిన్న గల్ఫ్‌ దేశాల్లో ప్రవాసాంధ్రులతోనూ సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే.

News October 25, 2025

HYD: మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా.. జర జాగ్రత్త..!

image

ఓ మహిళ మంటల్లో కాలిపోయిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD సరూర్‌నగర్ PS పరిధి త్యాగరాయనగర్ కాలనీలోని MSR రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 302లో మాధవి(45) నివాసం ఉంటుంది. ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత బయటకు వెళ్లిన మాధవి కొద్దిసేపు తర్వాత తిరిగొచ్చి వెలిగించింది. దీంతో మంటలు అంటుకుని ఆమె ఆర్తనాదాలు చేస్తూ చనిపోయింది. కేసు నమోదైంది. జర జాగ్రత్త..!