News March 31, 2025
వనపర్తి: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎంపీ రావుల

ముస్లింలు పవిత్రంగా చేసుకునే పండగనే రంజాన్ అని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం పెబ్బేరు మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చి ఉపవాస దీక్షలను విరమింప చేశారు. అనంతరం రావుల ముస్లింలతో మసీదులో ప్రార్థన లు చేశారు. రావుల మాట్లాడుతూ ముస్లింలు దేశం సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండేలా ప్రార్థనలు చేయాలని కోరారు. రంజాన్ పండగను ప్రశాంతంగా చేసుకోవాలని అన్నారు.
Similar News
News October 15, 2025
అడ్డగోలు NOCలు.. 55 మంది ఇంజినీర్లపై వేటు

HYD పరిధిలో చెరువులు, కుంటలు, కాల్వల పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తూ NOCలు జారీ చేసిన ఇంజినీర్ల(SE, EE, AEE, DEE) భరతం పట్టింది నీటిపారుదల శాఖ. పైరవీలు, పలుకుబడితో ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన 55 మందిని ఇతర జిల్లాలకు పంపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. బదిలీలపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉండటంతో వర్కింగ్ అరేంజ్మెంట్ పేరుతో ఇతర జిల్లాలకు పంపింది. వారి స్థానాల్లో ఇతర జిల్లాల వారిని ODపై తీసుకొచ్చింది.
News October 15, 2025
పెద్దపల్లి డీసీసీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నామినేషన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా హాజరై మద్దతు తెలిపారు.
News October 15, 2025
EPFO ఖాతాదారులకు అలర్ట్

PF అకౌంట్ ఉన్న వారు ఎక్కువకాలం ఉపాధి లేకుండా కొనసాగిన సందర్భాల్లోనే పూర్తిగా నగదు ఉపసంహరణ చేసుకునేలా EPFO సెంట్రల్ బోర్డు అనుమతిచ్చింది. ఏడాదిగా ఉద్యోగం లేని వారు EPF తుది పరిష్కారానికి, 3 ఏళ్లు ఉపాధి లేని వారు PF డబ్బుతో పాటు పెన్షన్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం 2 నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న వారు ఖాతాల్లోని నిధులను పూర్తిగా ఖాళీ చేస్తుండటంతో EPFO ఈ నిర్ణయం తీసుకుంది.