News February 2, 2025
వనపర్తి: ఈనెల 28 వరకు ‘30 పోలీస్ యాక్ట్ అమలు’: ఎస్పీ
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు “30 పోలీస్ యాక్ట్” అమల్లో ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ ఈ నెల 01 నుంచి 28 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు చేయరాదని తెలిపారు.
Similar News
News February 2, 2025
బాలుడి ఆవిష్కరణకు సీఎం రేవంత్ ప్రశంస
TG: హైబ్రిడ్ సైకిల్‌ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగన్‌కు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్‌తో నడిచే సైకిల్‌ను రూపొందించాడు.
News February 2, 2025
BREAKING: చరిత్ర సృష్టించిన భారత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ T20లో భారత్ చరిత్ర సృష్టించింది. T20Iలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(94*), తిలక్ వర్మ(24) విధ్వంసంతో 6 ఓవర్లలో భారత్ 95/1 రన్స్ చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాట్లాండ్పై చేసిన 82/2 పవర్‌ప్లేలో భారత్‌కు అత్యధిక స్కోరు కాగా, ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లలో 136-2గా ఉంది.
News February 2, 2025
ఆండ్ర ఎస్ఐపై విచారణకు ఆదేశం
ఆండ్ర ఎస్ఐ సీతారాములు తీరుపై విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ విచారణకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులను ఆయన కలిసినట్లుగా వచ్చిన ఆరోపణలపై బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డిని విచారణ చేసి నివేదిక పంపాలని ఆదేశించామన్నారు. విచారణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.