News April 3, 2024
వనపర్తి: ఈనెల 6న ఎన్నిక.. క్యాంప్‌కు 8 మంది కౌన్సిలర్లు !

వనపర్తి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈనెల 6న ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన 8 మంది కౌన్సిలర్లు క్యాంప్‌కు వెళ్లారు. వీరిలోనే పుట్టపాకల మహేశ్ ఛైర్మన్, పాకనాటి కృష్ణ వైస్ ఛైర్మన్ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న 9 మంది వీరికి మద్దతు ఇస్తే గెలుపుకు పక్కా అంటున్నారు.
Similar News
News April 20, 2025
MBNR: పీయూలో అధ్యాపకుల నిరసన.!

తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకుల జేఏసీ పిలుపు మేరకు పాలమూరు యూనివర్సిటీలో ఒప్పంద అధ్యాపకులు నిరవధిక సమ్మెలో భాగంగా మోకాళ్లపై నించొని నిరసన చేశారు. ఈ సందర్భంగా ఒప్పందం అధ్యాపకుల సంఘం నాయకులు తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, జీవో నెంబర్ 21 వెంటనే రద్దు చేయాలని, సెట్టు, నెట్టు పీహెచ్డీ అర్హత ఉన్న ఒప్పంద అధ్యాపకుల అందరినీ బేషరతుగా క్రమబద్ధీకరించాలని అన్నారు.
News April 19, 2025
MBNR: కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ సమావేశం

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ నందు కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం వద్దని, ప్రతి కేసు విచారణలో చార్జ్‌షీట్లను నిర్దేశిత కాల వ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. కోర్టు అధికారులు విధులలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
News April 19, 2025
నాగర్‌కర్నూల్: మహిళపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇంటి వద్ద విచారణ

నాగర్‌కర్నూల్ జిల్లా <<16145983>>ఊర్కొండపేట<<>> పబ్బతి అంజన్న గుడి వద్ద మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులతో పోలీసులు రీకన్‌స్ట్రక్షన్ చేయించిన విషయం తెలిసిందే. కాగా ఘటనా స్థలానికి ఏడుగురు నిందితులను తీసుకొచ్చిన పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబట్టారు. అలాగే అత్యాచారం ఘటన తర్వాత వారు ఇంటికి ఎలా వెళ్లారన్న కోణంపై ఆరా తీశారు. గ్రామంలోని నిందితులను వారి ఇంటికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు.