News March 30, 2025
వనపర్తి: ఉగాది పర్వదినాన..’WAY2NEWS’ తో పూజారి

శ్రీరంగాపూర్(M) తాటిపాముల గ్రామ దేవాలయంలో పూజారి ప్రకాష్ శాస్త్రి శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది ప్రాముఖ్యత, పంచాంగము వివరించారు. ఈ సందర్భంగా ‘Way2news’ తో మాట్లాడుతూ సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని తెలిపారు. ఉగాది షడ్రుచుల విశిష్టతను తెలిపారు.
Similar News
News November 16, 2025
BHPL: ఇందిరమ్మ ఇల్లు నిలుపుదలపై హైకోర్టులో రిట్ పిటిషన్

కక్షపూరితంగా ఇందిరమ్మ ఇల్లు నిలిపివేశారని ఆరోపిస్తూ BHPL జిల్లా గోరి కొత్తపల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఓ మహిళ న్యాయపోరాటానికి సిద్ధమైంది. అన్ని అర్హతలున్నా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, అధికారులు ఇల్లు ప్రొసీడింగ్ కాపీని నిలిపివేశారని, దానికి సమాధానం చెప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా కారణం తెలుసుకున్న ఆ మహిళ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
News November 16, 2025
KNR: NH-563లో ఇదేం ఇంజినీరింగ్..?

NH-563 ఫోర్ లైన్ నిర్మాణంలో ప్రణాళిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల వద్ద అండర్ పాస్లు గుర్తించకపోవడం, దీంతో ప్రజలు ఆందోళనలకు దిగడంతో ఇంజినీరింగ్ లోపాలు బయటపడ్డాయి. ఈ కారణంగా ప్లాన్ మార్చాల్సిన పరిస్థితి రావడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. 68 కి.మీ.ల రోడ్డు నిర్మాణంలో 9 మేజర్ బ్రిడ్జిలు, 20 మైనర్ బ్రిడ్జిలు, 189 కల్వర్టులు, 51 జంక్షన్లు నిర్మించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
News November 16, 2025
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

కోల్కతాలో టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 55* పరుగులతో రాణించారు. జడేజా 4, కుల్దీప్, సిరాజ్ చెరో 2, బుమ్రా, అక్షర్ ఒక్కో వికెట్ తీశారు. ఈ టెస్టులో భారత్ గెలవాలంటే 124 రన్స్ చేయాలి.


