News March 29, 2025

వనపర్తి: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ గిరిధర్

image

ఉగాది పండుగ సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రజా ప్రతినిధులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది పండుగను ప్రజలంతా ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎస్పీ పేర్కొన్నారు. బంధు మిత్రులతో సంతోషంగా ఉగాది పండగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Similar News

News November 13, 2025

ASF: ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్

image

రాజీమార్గాన సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 15న ఆసిఫాబాద్ కోర్టు భవనంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, ఎన్ఐ యాక్ట్, కుటుంబ కలహాలు, వాహన ప్రమాదాలు, సివిల్, బ్యాంకు రికవరీ ఇతర కేసులకు సంబంధించి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు.

News November 13, 2025

బంగాళదుంపతో బ్యూటిఫుల్ స్కిన్

image

బంగాళదుంపలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. చర్మసంరక్షణలో దీన్ని ఎలా వాడాలంటే..* బంగాళదుంప రసానికి తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. * బంగాళదుంప రసానికి పెరుగు కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే మలినాలను తొలగిస్తుంది.

News November 13, 2025

NZB: 25 మందికి రూ.18 లక్షల విలువైన చెక్కులు

image

ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ అన్నారు. గురువారం NZB R&B గెస్ట్ హౌస్‌లో 25 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల విలువైన CMRF చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు నిరంతరంగా అందిస్తామన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి CMRF చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు.