News October 19, 2024

వనపర్తి: ఉచిత న్యాయ సేవలకు టోల్ ఫ్రీ నంబర్ 15100

image

పేదలు ఉచిత న్యాయ సేవలు పొందవచ్చునని వనపర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి M.R. సునీత తెలిపారు. శుక్రవారం ఆమె జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవా అధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 15100, గోడ పత్రికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఉచితంగా న్యాయ సేవలు, సలహాలు పొందగోరు వారు టోల్ ఫ్రీ నంబర్ కానీ https://www.nalsa.gov.in/Isams/ ను సంప్రదించవచ్చు అన్నారు.

Similar News

News October 19, 2024

మాడ్గుల్: పిడుగుపాటు గురై 22 గొర్రెలు మృతి

image

మాడ్గుల్ మండలంలోని అంతంపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఉరుములతో కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై 22 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గొర్రెల యజమానులు మేత కోసం తమ మూగజీవాలను పొలాలకు తీసుకువెళ్లగా అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన యాటెల్లి రాములుకు చెందిన 12 గొర్రెలు, ముచర్ల చిన్న బక్కయ్యకు చెందిన 10 గొర్రెలు మృత్యువాత పడినట్లు వారు చెప్పారు.

News October 19, 2024

పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ ప్రొఫైల్

image

పీయూ VCగా రానున్న GN శ్రీనివాస్‌‌ది కరీంనగర్ జిల్లా గంభీరావ్‌పేట(M) కొత్తపల్లి. ఆయన 1-10వ తరగతి వరకు గంభీరావ్‌పేట, ఇంటర్ కామారెడ్డి, బీటెక్-JNTU, ఏఈ-OU, HD పట్టా JNTU నుంచి అందుకున్నారు. JNTUలో UGC మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్‌కు డైరెక్టర్‌గా, 77-ఎంటెక్,28-బీటెక్ ప్రాజెక్టులకు గైడ్‌గా వ్యవహరించారు. ‘ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఆన్ మెస్యూరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ ప్రత్యేక లెక్స్ బుక్ రచించారు.

News October 19, 2024

MBNR: వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

image

ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. త్వరలో మున్సిపాలిటీల పదవీ కాలం కూడా ముగియనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌ఛార్జిలతో నేనంటే నేను ఎంపీటీసీ, జడ్పీటీసి, సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?