News January 27, 2025

వనపర్తి: ఉత్తీర్ణత, హాజరు శాతం పెంచేందుకు చర్యలు

image

వనపర్తి జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థుల ఉత్తీర్ణత, హాజరు శాతం పెంచేందుకు ఇంటర్ విద్య చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో అకాడమిక్ సెల్ ఏర్పాటు చేశారు. ముగ్గురుని సభ్యులుగా నియమించారు. ఈ బృందం అకాడమిక్ విషయాలను పరిశీలిస్తుందని జిల్లా ఇంటర్ అధికారులు తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రయోగ పరీక్షలు, మార్చి 5 నుంచి థియరీ పరీక్షలు జరగనున్నాయి.

Similar News

News February 24, 2026

8వ తరగతి బుక్‌పై వివాదం

image

వచ్చే విద్యా సం. కోసం 8వ తరగతి సోషల్ బుక్‌లో NCERT చేసిన కొన్ని మార్పులపై వివాదం రాజుకుంది. ‘సమాజంపై న్యాయవ్యవస్థ ప్రభావం’ టాపిక్‌లో కొత్తగా ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశాన్ని చేర్చారు. ప్రజలకు జుడీషియరీపై తప్పుడు ఉద్దేశం ఏర్పడుతుందని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక స్వాతంత్ర్య ఉద్యమ టాపిక్‌లో.. దేశ విభజనను తొలుత కాంగ్రెస్ వ్యతిరేకించినప్పటికీ, చివరికి తప్పక అంగీకరించిందని కొత్తగా చేర్చింది.

News February 24, 2026

HYD: 3 కార్పొరేషన్ల వెబ్‌సైట్లు ఇవే!

image

300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలైన విషయం తెలిసిందే. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్‌సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్‌సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్‌సైట్లలో ప్రజలు సేవలు పొందొచ్చని అధికారులు తెలియజేశారు.
# SHARE IT

News February 24, 2026

మేడ్చల్: రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు!

image

రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు యంత్రాంగం వెల్లడించింది. పరీక్షల నిర్వహణకు 182 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో 64,780 ఒకేషనల్ కోర్సులో 1,368 మంది, సెకండ్ ఇయర్ 67,792 జనరల్ విభాగం, ఒకేషనల్ విభాగంలో 1,258 మంది విద్యార్థులు పరీక్ష రాయలున్నారు. కావాల్సినన్నీ సిద్ధంచేసుకుని కూల్‌గా ఉండటానికి ప్రయత్నించండి.