News March 26, 2025
వనపర్తి: ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ: బచ్చు రాము

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుందని జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడు బచ్చు రాము అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో బచ్చు రాము మాట్లాడుతూ.. ఉగాది పండుగ నుంచి ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేయనుందని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, డీఎస్ఓ, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 16, 2025
BREAKING: భారత్ భారీ స్కోర్

U-19 ఆసియా కప్లో భాగంగా మలేషియాతో జరిగిన వన్డేలో భారత ప్లేయర్లు అదరగొట్టారు. 50 ఓవర్లలో 408/7 స్కోర్ చేశారు. అభిజ్ఞాన్ 125 బంతుల్లో అజేయంగా 209 రన్స్ చేశారు. ఇందులో 17 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. వేదాంత్ త్రివేది 90, వైభవ్ 50, ఆయుశ్ మాత్రే 14, చౌహాన్ 14 రన్స్ చేశారు. కాగా ఈ టోర్నీలో భారత్ యూఏఈ, పాక్పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది.
News December 16, 2025
BREAKING: భారత ప్లేయర్ విధ్వంసం.. డబుల్ సెంచరీ

U-19 ఆసియా కప్లో భాగంగా మలేషియాతో మ్యాచ్లో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిజ్ఞాన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ చేశారు. ఇందులో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 48వ ఓవర్లో అభిజ్ఞాన్, చౌహాన్ 29 పరుగులు బాదారు. వరుసగా 4, వైడ్, 6, 6, 6, వైడ్, 1, 4 రన్స్ వచ్చాయి.
News December 16, 2025
జోజినగర్ స్థలం కబ్జాలో టీడీపీ నేతల పాత్ర: వైఎస్ జగన్

విజయవాడ భవానిపురంలోని జోజినగర్ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూ.150 కోట్ల విలువైన స్థలాన్ని టీడీపీ నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 2016లో రమా సొసైటీ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, 25 ఏళ్లుగా నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం దారుణమని జగన్ అన్నారు.


