News January 24, 2025

వనపర్తి: ఒత్తిడి నుంచి తప్పించేందుకు చర్యలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు టెలి మెంటల్ హెల్త్ అసిస్టెంట్స్ అండ్ నెట్వర్కింగ్ (Tele-MANAS) ప్రారంభిస్తున్నామని జిల్లా ఇంటర్ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 14416, 1800914416 నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. సైకాలజిస్టులు ఉచితంగా సేవలు అందిస్తారని పేర్కొన్నారు.

Similar News

News December 8, 2025

నిర్మల్: మూడు రోజులు సెలవులు

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలనుసారం మూడు దఫాల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ నెల 11, 14, 17న ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించిందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎన్నికలు ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ ఆమోదిత సంస్థలకు సెలవులు ఉంటాయన్నారు.

News December 8, 2025

భద్రాద్రి: గుట్కాల వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి: ఎంపీ

image

గుట్కాలు, పాన్ మసాలా, జర్థాల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, నోటి, గొంతు కేన్సర్ బారిన పడుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ రవిచంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీస్ బిల్లు-2025 పై రాజ్యసభలో మాట్లాడారు. పిల్లలను చదివించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాట్లాడారు.

News December 8, 2025

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: హనుమకొండ కలెక్టర్

image

అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్ పోస్టర్లను ఆవిష్కరించారు. అవినీతి నిర్మూలనలో ప్రతి పౌరుడు, ఉద్యోగి బాధ్యత వహించాలని ఆమె అన్నారు. లంచం డిమాండ్ చేస్తే ACB టోల్ ఫ్రీ 1064కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వరంగల్ ACB డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.