News April 10, 2025
వనపర్తి: కలెక్టరేట్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి ఐడీఓసీ సమావేశం మందిరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి ఇందిర తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లాలోని ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, కుల సంఘాల పెద్దలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Similar News
News December 13, 2025
JGTL: మొదటి విడత.. ఓటు వేయని థర్డ్ జెండర్.!

జగిత్యాల జిల్లాలో నిన్న జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు 7 మండలాల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ విడతలో మొత్తం 2,18,194 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 1,20,238, స్త్రీలు 1,15,955 మంది ఉన్నారు. వీరితో పాటు కేవలం ఒకే ఒక్క థర్డ్ జెండర్ ఓటరు మెట్‌పల్లి మండలంలో నమోదై ఉన్నారు. ఆ ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికారులు తెలిపారు. థర్డ్ జెండర్ ఓటరు పోలింగ్‌కు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
News December 13, 2025
ప్రకాశం: అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల జాబితా విడుదల

ప్రకాశం జిల్లాలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లగా ఎంపికైన 117 మందితో జాబితా విడుదల చేశామని డీఈవో రేణుక తెలిపారు. www.prakasamschooledu.com ద్వారా జాబితా చెక్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 15వ తేదీలోగా కేటాయించిన పాఠశాలల్లో జాయిన్ కావాలని ఆదేశించారు. సంబంధిత హెచ్ఎంలు ప్రతి నెలా 2వ తేదీన డ్యూటీ సర్టిఫికేట్ సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.
News December 13, 2025
తిరుపతి: 848 మంది విద్యార్థుల గైర్హాజరు

జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తిరుపతి DEO కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష జరిగిందన్నారు. మొత్తం 2,060 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,212 విద్యార్థులు పరీక్షఖు హాజరైనట్లు చెప్పారు. 848 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.


