News March 31, 2024
వనపర్తి: కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
శనివారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని 50వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 28, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!
✔మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన సీఎం, ఉమ్మడి జిల్లా నేతలు✔అభివృద్ధికి సహకరించండి: బండి సంజయ్✔ప్రారంభమైన రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు✔REWIND: పాలమూరుకు అండగా మన్మోహన్ సింగ్✔కార్మికుల హామీలు నెరవేర్చాలి:CITU✔జోగులాంబ అమ్మవారి సేవలో హీరో ఆకాశ్✔కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే✔GREAT:రగ్బీ రాష్ట్ర జట్టుకు కోస్గి విద్యార్థి✔GWDL:Way2Newsతో ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆవేదన
News December 27, 2024
NGKL: మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన సీఎం, ఎంపీ
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిలో రాష్ట్రానికి చెందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
News December 27, 2024
MBNR: GET READY.. నేటి నుంచి ‘CM CUP-24’ పోటీలు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని DSA మైదానంలో సీఎం కప్-2024 పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 1,584 మంది క్రీడాకారులు, 150 మంది అఫీషియల్స్ హాజరుకానున్నారు. 6 మ్యాట్లపై మ్యాచులు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ నెట్ బాల్, కబడ్డీ రాష్ట్రస్థాయి టోర్నీకి అతిథ్యం లభించింది. ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేనెల 2 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.