News March 2, 2025

వనపర్తి: కాశీంనగర్ ఎత్తిపోతలను పూర్తి చేస్తాం: సీఎం

image

వనపర్తి జిల్లాలో కాశీంనగర్ ఎత్తిపోతలను తప్పకుండా పూర్తి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరులో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ వల్లేనని అన్నారు. వనపర్తిలో మహిళా సంఘాలకు రూ.వేయ్యి కోట్లు ఇస్తున్నామని తెలిపారు. వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు.

Similar News

News March 26, 2025

MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

image

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..

News March 26, 2025

ఆన్‌లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం: సీఎం

image

AP: నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు CM చంద్రబాబు సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. ‘నేరస్థులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తారు. YS వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ. అందుకే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.

News March 26, 2025

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి అడుగులు

image

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్‌ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.

error: Content is protected !!