News March 13, 2025
వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్

విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ డీఇవో అబ్దుల్ ఘని ఉత్తర్వులుజారీ చేశారు. పాన్గల్ జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న చిన్న నాగన్న, రఘురాం ఈనెల 5న స్కూల్లో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. డీఇవో విచారణ చేసి టీచర్లను సస్పెండ్ చేశారు. హెచ్ఎం విజయ్, టీచర్ కిరణ్కు షోకాస్ నోటీస్ జారీ చేశారు.
Similar News
News November 9, 2025
వికారాబాద్ బీజేపీ అధ్యక్ష పదవి జాప్యంపై ఉత్కంఠ

డాక్టర్ రాజశేఖర్రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినా, అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యానికి కారణం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో భారీగా ఉత్కంఠ నెలకొంది.
News November 9, 2025
అన్నమయ్య: నూతన కమిటీ నియామకం

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్.శ్రీలక్ష్మి, పి.రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా యం.గౌరి నియమితులయ్యారు. ఆ సంఘం 2వ జిల్లా మహాసభ మదనపల్లె ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది. 13 మంది ఆఫీస్ బేరర్లు, 33మందితో జిల్లా కమిటీ ఏర్పరిచారు.
News November 9, 2025
భద్రాద్రి: ఏ క్యాహై.. ఎమ్మెల్యే సాబ్ జర దేఖో..!

చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో మృతి చెందిన వారి అంతిమయాత్రలో బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కబరస్థాన్ (శ్మశానవాటిక)కు వెళ్లే రోడ్డు మార్గం లోతైన గుంతలతో, బురదమయంగా మారింది. దీంతో గ్రామస్థులు మృతదేహాన్ని భుజాలపై కాకుండా, చేతులపై మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. సమస్య తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పందించి, రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరారు.


