News March 13, 2025

వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్

image

విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ డీఇవో అబ్దుల్ ఘని ఉత్తర్వులుజారీ చేశారు. పాన్‌గల్ జడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న చిన్న నాగన్న, రఘురాం ఈనెల 5న స్కూల్‌లో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీఇవో విచారణ చేసి టీచర్లను సస్పెండ్ చేశారు. హెచ్ఎం విజయ్, టీచర్ కిరణ్‌కు షోకాస్ నోటీస్ జారీ చేశారు.

Similar News

News February 23, 2026

MBNR: పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

News February 23, 2026

పాలమూరు: మత్తు వదలండి.. మైదానాలు చేరండి: మంత్రి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచాన్ని వదిలి క్రీడలపై ధ్యాస పెడితే ప్రపంచం మొత్తం తమ వైపు చూస్తుందన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

News February 23, 2026

MBNR: సౌత్ జోన్.. పీయూలో చెస్ ఎంపికలు

image

పీయూలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు చెస్ (పురుషుల) ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యూనివర్సిటీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, క్రీడాకారులు ప్రతిభ చాటి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ పూస రమేశ్ బాబు, పీడీ డా.వై.శ్రీనివాసులు, కోచ్‌లు పాల్గొన్నారు. ఎంపికైన వారు మార్చి 1న నుంచి తమిళనాడులో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు.