News March 13, 2025
వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్

విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ డీఇవో అబ్దుల్ ఘని ఉత్తర్వులుజారీ చేశారు. పాన్గల్ జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న చిన్న నాగన్న, రఘురాం ఈనెల 5న స్కూల్లో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీఇవో విచారణ చేసి టీచర్లను సస్పెండ్ చేశారు. హెచ్ఎం విజయ్, టీచర్ కిరణ్కు షోకాస్ నోటీస్ జారీ చేశారు.
Similar News
News November 12, 2025
పేదలందరికీ సొంతింటి కల నిజం చేయాలి: కలెక్టర్

మచిలీపట్నంలో పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. చింతగుంటపాలెంలో పీఎంఏవై 1.0 పథక గృహాలను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పీఎంఏవై 2.0 గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలో 6,708 గృహాలు, మచిలీపట్నం నియోజకవర్గంలో 1,101 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. కొత్త లబ్ధిదారులు నవంబర్ చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News November 12, 2025
కరీంనగర్: ఏసీబీ రైడ్లో నమోదైన కేసుల వివరాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2025లో ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల వివరాలను ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. రెవెన్యూ-8, పంచాయితీ రాజ్-6, రిజిస్ట్రేషన్-3, ఖజానా-3, మున్సిపల్-3, అగ్రికల్చర్-3, ఔషధ విభాగం-3, ఆర్టీఏ-3, పోలీస్-1 రెడ్ హ్యాండెడ్గో పట్టుకున్నామన్నారు. 30 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News November 12, 2025
స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి: కలెక్టర్

జిల్లాలో అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం పాడేరులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. గర్భిణులు, బాలింతలు, శస్త్రచికిత్స అవసరమైన వారికి రక్తం అవసరం ఉంటుందన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు.


