News March 13, 2025

వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్

image

విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ డీఇవో అబ్దుల్ ఘని ఉత్తర్వులుజారీ చేశారు. పాన్‌గల్ జడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న చిన్న నాగన్న, రఘురాం ఈనెల 5న స్కూల్‌లో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీఇవో విచారణ చేసి టీచర్లను సస్పెండ్ చేశారు. హెచ్ఎం విజయ్, టీచర్ కిరణ్‌కు షోకాస్ నోటీస్ జారీ చేశారు.

Similar News

News November 21, 2025

VKB: అనంత పద్మనాభుడికి భారీ ఆదాయం

image

వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కార్తీక మాస పెద్ద జాతర హుండీ లెక్కింపు జరిగింది. 15 రోజుల జాతర ఉత్సవాల్లో భక్తులు వేసిన హుండీలో రూ.6,02,675 వచ్చినట్లు EO నరేందర్ తెలిపారు. అధికారుల సమక్షంలో నిఘా ఏర్పాటు చేసి కానుకలను లెక్కించామని అన్నారు. శుక్రవారం జాతర వేడుకల్లో భాగంగా ఈ లెక్కింపు నిర్వహించారు.

News November 21, 2025

క్లబ్‌లుగా మారిన స్కూళ్లు.. అష్నీర్ గ్రోవర్ ఆగ్రహం

image

ఢిల్లీలో 10వ తరగతి విద్యార్థి <<18336011>>ఆత్మహత్య<<>> కలకలం రేపింది. ఉపాధ్యాయుల అవమానాలు, మానసిక వేధింపులే కారణమని విద్యార్థి తండ్రి ఆరోపించడంతో విద్యా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై BharatPe మాజీ MD అష్నీర్ గ్రోవర్ స్పందిస్తూ పెద్ద నగరాల్లో స్కూళ్లలో సీటు రావడం స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారని అన్నారు. దీనివల్ల స్కూళ్లు క్లబ్‌లుగా మారాయని, యాజమానులు కూడా క్లబ్ ఓనర్లలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

News November 21, 2025

మెదక్: డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి: కలెక్టర్

image

యువత, విద్యార్థులు సహా ప్రతీ ఒక్కరూ మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మెదక్ కలెక్టరేట్‌లో శుక్రవారం డ్రగ్స్ నిర్మూలనపై అధికారులు, పోలీసు సిబ్బందితో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం పెరిగిపోతూ, మహమ్మారి లా సమాజాన్ని, యువతను చెడు మార్గం వైపు నడిపిస్తుందన్నారు.