News March 26, 2025

వనపర్తి: కూరగాయలు, పండ్లు పాడవుతున్నాయా? ఇలా చేయండి..

image

✓ కూరగాయలను నేరుగా వేడి తాకే ప్రదేశంలో పెట్టవద్దు. ✓ ఫ్రిజ్ టెంపరేచర్ 4°C లేదా అంతకంటే తక్కువే ఉంచాలి. ✓ ఫ్రిజ్ అంతా సరుకులతో నింపకుండా గాలి తాకేలా స్పేస్ ఉంచాలి. ✓ అరటి, ఆపిల్, టమాటా, అవకాడో లాంటి పండ్లు, కూరగాయలు ఇథలిన్‌ను విడుదల చేస్తాయి. వాటి వల్ల మిగిలినవీ త్వరగా పండుతాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిని వేరువేరుగా ఉంచాలి. ✓ త్వరగా పాడయ్యే వాటిని ముందు వాడుకోవడం ఉత్తమం.

Similar News

News April 2, 2025

ఏలూరు జిల్లాలో 112 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

ఏలూరు జిల్లాలో మహిళా శిశు అభివృద్ధి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధింత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 సీడీపీవోల కార్యాలయాల పరిధిలోని అంగన్వాడీ కమిటీ ఛైర్మన్ కె.వెట్రిసెల్వి మంగళవారం ఆమోదించారని ఐసీడీఎస్ పీడీ శారద తెలిపారు. 12 మంది అంగన్వాడీలు, ఏడుగురు మిని వర్కర్సు. 93మంది హెల్పర్లను గౌరవ వేతనంపై తీసుకుంటామన్నారు. స్థానిక మహిళలై ఉండి పదవ తరగతిలో ఉత్తీర్ణలై ఉండాలన్నారు.

News April 2, 2025

ప్రకృతికి తోడుగా నాలుగున్నర లక్షల మంది

image

HCU భూముల వివాదంపై అటు విద్యార్థులు, ప్రతిపక్షాలు రోడ్డెక్కి నిరసన చేస్తుంటే.. ఇన్‌స్టాలో నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. ఆ భూములను రక్షించాలంటూ స్టోరీల ద్వారా గళమెత్తినవారి సంఖ్య నాలుగున్నర లక్షలకు చేరింది. యువత అంతా తమ ఓటు ప్రకృతికేనంటూ మద్దతు తెలుపుతున్నారు. మూగ జీవులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ నినదిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

News April 2, 2025

జపాన్‌కు పొంచి ఉన్న ముప్పు.. డేంజర్‌లో 3లక్షల మంది ప్రాణాలు!

image

జపాన్‌లో త్వరలోనే అతిపెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు తీసుకుంటుందని, జపనీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విపత్తు భారీ విధ్వంసానికి కారణమవుతుందని, సునామీలు సంభవించి ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని చెబుతున్నారు. రెస్క్యూ సిబ్బందిని అలర్ట్‌ చేశారు. ఇటీవలే మయన్మార్‌లో వచ్చిన భూకంపానికి వేల మంది చనిపోయారు.

error: Content is protected !!