News March 31, 2025
వనపర్తి: కొడుకు మృతి తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్య

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన గోపాల్‌పేట మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. బుద్దారానికి చెందిన కోదండరాములు(55) కుమారుడు ఆంజనేయులు భార్యతో గొడవలు, ఇంటి సమస్యల కారణంగా ఇటీవల ఇంట్లో ఉరేసుకున్నాడు. కోదండరాములు చిన్న కొడుకు సైతం ఏడాది క్రితం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News April 5, 2025
టాప్‌లోనే కొనసాగుతోన్న PBKS

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ టాప్‌లోనే కొనసాగుతోంది. మరోవైపు పట్టికలో అట్టడుగున సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఆ తర్వాత RCB, KKR, LSG, MI, CSK, RR, SRH ఉన్నాయి. ఇవాళ రెండు మ్యాచులు ఉండటంతో టేబుల్‌లో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.
News April 5, 2025
రేషన్ లబ్ధిదారుల ఇంట్లో తింటాం: నిర్మల్ కలెక్టర్ అభిలాష

సన్న బియ్యం పంపిణీ పట్ల జిల్లా ప్రజల నుంచి మంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సన్న బియ్యం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తీ ఏర్పాట్లను చేశామన్నారు. ప్రతి నెల సన్నబియ్యాన్ని సమయానికి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో తయారుచేసిన భోజనాన్ని స్వీకరిస్తామని చెప్పారు.
News April 5, 2025
MDK: దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ VRO/ VRAలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 16 లోపు గూగుల్ ఫామ్ (https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7) నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్వయంగా సంతకం చేసిన కాపీని కలెక్టర్ కార్యాలయం(సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం)లో సమర్పించాలని అన్నారు.