News February 12, 2026
వనపర్తి: కౌంటింగ్ కేంద్రాలు ఇవే..!

వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ఈనెల 11న ఎన్నికలు జరిగాయి. 13వ తేదీన ఓట్ల కౌంటింగ్ జరగనుంది. మున్సిపాలిటీల వారీగా ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వివరాలు ఇలా..
వనపర్తి: ప్రభుత్వ (CO-ED) డిగ్రీ కళాశాల నర్సింగయ్యపల్లి
పెబ్బేరు: ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల (జాతీయ-44 రహదారి పక్కన)
కొత్తకోట: ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఆత్మకూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాల
అమరచింత: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
Similar News
News March 16, 2026
WGL: ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

WGL(D) ఖానాపూర్(M)లోని ఓ గ్రామంలో ఐదేళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రసాద్ బాలికను బైక్‌పై కిరాణాషాప్‌కు తీసుకెళ్లి చాక్లెట్ ఇచ్చి సమీప చెరువువద్దకు తీసుకెళ్లి దురాగతానికి ప్రయత్నించినట్లు సమాచారం. బాలిక అరవడంతో సమీపంలోని రైతులు గమనించగా నిందితుడు బాలికను ఇంటివద్ద వదిలివెళ్లిపోగా పోలీసులు దర్యాప్తుచేపట్టారు. పోక్సో కేసు నమోదైంది.
News March 16, 2026
మండుతున్న ఎండలు.. పెంట్లవెల్లిలో 38.6°C

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా పెంట్లవెల్లిలో 38.6°C ఉష్ణోగ్రత నమోదైంది. అచ్చంపేట, కల్వకుర్తిలో 38.5°C, తాడూర్‌లో 38.4°C గా రికార్డయ్యాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
News March 16, 2026
బాలికల వసతి గృహంలో ఆగంతకుడు కలకలం

చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహంలోకి రాత్రివేళ ఓ ఆగంతకుడు గోడదూకి ప్రవేశించడం కలకలం రేపింది. విద్యార్థినులు భయంతో కేకలు వేయడంతో సదరు వ్యక్తి పరారయ్యాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు నిర్వాహకులు ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అధికారులను నిలదీశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై మండిపడ్డారు. భద్రతా వైఫల్యంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


